IPL 2025 : ఉప్పల్ లో భారీ వర్షం.. ఆగిన SRH vs DC మ్యాచ్

by Muthe.Rajitha |

ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా హైదరాబాద్, ఢిల్లీ(SRH vs DC) జట్లు తలపడుతున్నాయి.

IPL 2025 : ఉప్పల్ లో భారీ వర్షం.. ఆగిన SRH vs DC మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా హైదరాబాద్, ఢిల్లీ(SRH vs DC) జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. అయితే అనంతరం సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగాల్సి ఉండగా.. ఉప్పల్ స్టేడియాన్ని భారీ వర్షం(Heavy Rain) కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం కురుస్తున్న వర్షం కారణంగా SRH vs DC మ్యాచ్ కి అంతరాయం(Rain Delay) కలిగింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు స్టేడియం సిబ్బంది.

సాధారణంగా వర్షం వలన మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ప్రకటిస్తారు. కాని రన్ రేటులో అత్యంత వెనుకబడిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో తప్పకుండా భారీ విజయాన్ని నమోదు చేయాలి. అలా కాకుండా మ్యాచ్ రద్దు అయితే SRH ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story