AUS VS SA : పరుగుల వరద పారించిన గ్రీన్, హెడ్, మార్ష్.. సౌతాఫ్రికా‌పై ఆస్ట్రేలియా రికార్డు విక్టరీ

by Harish |

సౌతాఫ్రికా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం పరుగుల వరద పారించింది.

AUS VS SA : పరుగుల వరద పారించిన గ్రీన్, హెడ్, మార్ష్.. సౌతాఫ్రికా‌పై ఆస్ట్రేలియా రికార్డు విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం పరుగుల వరద పారించింది. గ్రీన్(118 నాటౌట్), హెడ్(142), మిచెల్ మార్ష్(100) శతకాలతో రెచ్చిపోవడంతో ఆసిస్ వన్డేల్లో రెండో బిగ్గెస్ట్ విక్టరీని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు 276 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. 2023లో నెదర్లాండ్స్‌పై 309 పరుగుల గెలవడం ఆసిస్‌కు బిగ్గెస్ట్ విక్టరీ కాగా.. ఇది రెండో అతిపెద్ద విజయం. మరోవైపు సౌతాఫ్రికాకు ఇది అది పెద్ద ఓటమి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి 431 రన్స్ చేసింది.

హెడ్, మార్ష్‌లకుతోడు గ్రీన్ మెరుపు శతకం తోడవడంతో ఆసిస్ వన్డేలలో రెండో అతిపెద్ద స్కోరు నమోదు చేసింది. తొలి వికెట్‌కు హెడ్, మార్ష్ కలిసి 250 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత గ్రీన్ మెరుపులు ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. గ్రీన్ కేవలం 55 బంతుల్లోనే 6 పోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలెక్స్ కేరీ(50 నాటౌట్) కూడా రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 24.5 ఓవర్లలోనే 155 పరుగులకే కుప్పకూలింది. డెవాల్డ్ బ్రెవిస్(49), టోనీ డె జార్జి(33) కాస్త పర్వాలేదనిపించారు. ఆసిస్ స్పిన్నర్ కూపర్ కొన్నోలీ ఐదు వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించాడు. అయితే, తొలి రెండు వన్డేల్లో నెగ్గడంతో దక్షిణాఫ్రికా 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసిస్‌తో చివరి ఐదు వన్డే సిరీస్‌లు సౌతాఫ్రికానే గెలవడం విశేషం. అలాగే, ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్‌లు నెగ్గిన జట్టు కూడా సౌతాఫ్రికానే(9 సిరీస్‌లు).


Next Story