- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Travis Head : డే అండ్ నైట్ టెస్టుల్లో హెడ్ అరుదైన రికార్డు
దిశ, స్పోర్ట్స్ : డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డు నమోదు చేశారు. అడిలైడ్‌లో రెండో రోజు సెంచరీ ఈ ఆసీస్ ప్లేయర్ 141 బంతుల్లో 140 పరుగులు చేశాడు. దీంతో డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. హెడ్ పింక్ బాల్ టెస్ట్‌ల్లో మూడు సెంచరీలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాకే చెందిన మన్రూస్ లబుషేన్ నాలుగు సెంచరీలో ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా సైతం హెడ్ రికార్డు నెలకొల్పాడు. అడిలైడ్ టెస్ట్‌లో కేవలం 111 బంతుల్లో సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా భారత్‌పై ఆడిన 12 టెస్ట్‌ల్లో హెడ్ 44.75 యావరేజ్‌తో 955 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 163 హెడ్ అత్యధిక స్కోరుగా ఉంది.