- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2027 World Cup: కోహ్లీ, రోహిత్ ఆడటంపై గంభీర్ షాకింగ్ స్టేట్‌మెంట్ !
2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంపై తాజాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ( VIRAT KOHLI ), రోహిత్ శర్మ ( ROHIT SHARMA) ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించుకొని ఇండియాను విశ్వ విజేతగా నిలపాలన్న కసితో ఆడుతున్నారు. అంతేకాదు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కూడా ఈ ఇద్దరు క్రికెటర్లు టాప్ 5 లో ఉండడం గమనార్హం. దాదాపు 40 సంవత్సరాల వయసు దగ్గర పడినప్పటికీ, ఫుల్ ఫిట్నెస్ సాధించి, కుర్ర క్రికెటర్లతో పోటీ పడుతున్నారు.
రోహిత్, విరాట్ కోహ్లీ పై గంభీర్ కీలక ప్రకటన
2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంపై తాజాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( GAUTAM GAMBHIR) స్పందించారు. అప్పట్లో వాళ్లు ఆడడం తన చేతిలో లేదని చేతులు దులుపుకున్న గౌతమ్ గంభీర్, ఇప్పుడు మాట మార్చాడు. రోకో కాంబినేషన్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. 2027 వరల్డ్ కప్ లో వాళ్ళిద్దరూ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని క్లారిటీ ఇచ్చాడు గంభీర్. వాళ్ల ఆట తీరు చూస్తుంటే, టైటిల్ కూడా తీసుకువచ్చే ఛాన్సులు ఉన్నాయన్నారు. దీంతో గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.






