ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన ట్రావిస్ హెడ్.. యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం

by Malleboina Mahesh |

ప్రపంచ క్రికెట్‌లో ద యాషెస్ టెస్ట్ (Ashes Test)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ టెస్టు.. ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్దాన్ని తలపిస్తుంది.

ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన ట్రావిస్ హెడ్.. యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో ద యాషెస్ టెస్ట్ (Ashes Test)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ టెస్టు.. ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్దాన్ని తలపిస్తుంది. 1882లో ఇంగ్లాండ్ ఓటమి తర్వాత "English cricket has died" అనే వ్యంగ్య వ్యాఖ్యతో ప్రారంభమైన ఈ సిరీస్, అప్పటి నుంచి క్రికెట్ ప్రతిష్ఠను, గర్వాన్ని ప్రతినిధ్యం చేస్తూ వస్తోంది. ఇలాంటి ఈ టెస్టులో భాగంగా 74వ యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయి ఆడారు. మొదటి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌట్ చేయగా.. అదే రీతిలో ఇంగ్లాండ్ బౌలర్లు సైతం మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 132 పరుగులకే ఆస్ట్రేలియాలను ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ జట్టు రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లకు షాక్ ఇచ్చారు.

మెరుపు వేగంతో బంతులు వేయడం తో వాటిని ఎదుర్కోవడంలో బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 204 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగగా ఓపెనర్ ట్రావిస్ హెడ్, జాకీ వితరాల్డ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అలాగే ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన లాబుచానే 51 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని 28. 2 ఓవర్లలో చేధించి.. 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించింది. దీంతో యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 లీడ్ లో కొనసాగుతోంది.

Next Story