ద్రవిడ్ అప్పుడే తప్పుకుంటానని చెప్పాడు : రోహిత్ శర్మ

by Harish |

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి ఆదివారంతో ఏడాది పూర్తయ్యింది.

ద్రవిడ్ అప్పుడే తప్పుకుంటానని చెప్పాడు : రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి ఆదివారంతో ఏడాది పూర్తయ్యింది. ఈ పొట్టి ప్రపంచకప్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతోపాటు అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఎంతో స్పెషల్. ఈ ప్రపంచకప్‌ విజయం తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆటగాడిగా ప్రపంచకప్ గెలవని ద్రవిడ్ హెడ్ కోచ్‌గా తన కల నెరవేర్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌తో ప్రధాన కోచ్‌గా అతని పదవీకాలాన్ని ఘనంగా ముగించాడు.

అయితే, ద్రవిడ్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో చాలా నిరాశ చెందాడట. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనుకున్నాడట. కానీ, రోహిత్ శర్మ ద్రవిడ్‌ను టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగాలని ఒప్పించాడట. ఈ విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ‘రాహుల్ భాయ్ 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత పదవీ విరమణ చేయాలనుకున్నాడు. ‘మరో ఆరు నెలల్లో మరో ప్రపంచకప్ వస్తుంది. ఇక్కడి వరకు వచ్చాం. మరోసారి ప్రయత్నిద్దాం.’అని ద్రవిడ్‌కు చెప్పా. అతను కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు అతను సరైన నిర్ణయం తీసుకున్నాడని ఇప్పుడు కూడా చెబుతా.’అని రోహిత్ చెప్పుకొచ్చాడు.


Next Story