- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రోహిత్ అన్నయ్యలాంటివాడు.. భారత కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించిన సర్ఫరాజ్ ఖాన్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరినీ జూనియర్‌లా చూడడని భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సర్ఫరాజ్.. హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ తనకు అన్నయ్యలాంటివాడని చెప్పాడు. ‘రోహిత్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అతనితో సౌకర్యవంతంగా ఉండొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మా అందరికీ అన్నయ్యలాంటివాడు. ఎవరినీ జూనియర్‌లా చూడడు. రోహిత్ మాట్లాడే విధానం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.
అలాగే, రోహిత్‌ను లగాన్ మూవీలో అమీర్ ఖాన్ పాత్రతో సర్ఫరాజ్ పోల్చాడు. ‘లగాన్ నాకు ఇష్టమైన మూవీ. ఆ మూవీలో అమీర్ ఖాన్ తన జట్టును సమీకరించే విధానం నాకు రోహిత్ భాయ్‌నే గుర్తు చేస్తుంది. రోహిత్ మన కుటుంబంలో భాగమైనట్టు అనిపిస్తుంది.’ అని తెలిపాడు. కాగా, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు రోహిత్ కెప్టెన్సీలో ప్రకటించిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన అతను ఆకట్టుకున్నాడు. మరి, బంగ్లాతో తొలి టెస్టులో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.