- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీని వీడనున్న కోహ్లీ?.. భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
by Harish |
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లీ వచ్చే సీజన్‌కు ఆర్సీబీకి ఆడటం లేదన్న వార్తలు గుప్పుమన్నాయి.

X
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లీ వచ్చే సీజన్‌కు ఆర్సీబీకి ఆడటం లేదన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆర్సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్‌ను కోహ్లీ రిజెక్ట్ చేశాడన్న కథనాలు రావడంతో జట్టును వీడనున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. కోహ్లీ ఆర్సీబీని వీడడని, బెంగళూరుకే ఆడతాడని అభిప్రాయపడ్డాడు. ‘అతను వాణిజ్య ఒప్పందాన్ని తిరస్కరించినట్టు సమాచారం. దాని అర్థం ఫ్రాంచైజీని వీడుతున్నట్టు కాదు. అతను కచ్చితంగా ఆర్సీబీకే ఆడతాడు. అతను ఆడితే అదే ఫ్రాంచైజీకి ఆడతాడు. ఈ ఏడాదే అతను టైటిల్ గెలిచాడు. ఎందుకు ఫ్రాంచైజీని వీడతాడు?. అతను ఎక్కడికి వెళ్లడు.’అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
Next Story






