అభిషేక్ శర్మ మరో సెహ్వాగ్, రిచర్డ్స్ కాగలడు

by Ajay Maddhiboyina |

హర్బజన్ సింగ్ మరో మెట్టు ఎక్కి.. అభిషేక్ శర్మను టెస్టుల్లోకి తీసుకుంటే మరో వీరేంద్ర సెహ్వాగ్, వివియన్ రిచర్డ్స్ అవుతాడని చెప్పాడు.

అభిషేక్ శర్మ మరో సెహ్వాగ్, రిచర్డ్స్ కాగలడు
X

- టెస్టు క్రికెట్‌లో రాణించగలడు

- త్వరలోనే చోటు దక్కుతుంది

- మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా క్రికెటర్ అభిషేక్ శర్మ తన పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 ఫోర్లు, 13 సిక్సులు ఉండటం గమనార్హం. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. తాజాగా హర్బజన్ సింగ్ మరో మెట్టు ఎక్కి.. అభిషేక్ శర్మను టెస్టుల్లోకి తీసుకుంటే మరో వీరేంద్ర సెహ్వాగ్, వివియన్ రిచర్డ్స్ అవుతాడని చెప్పాడు. క్రికెట్‌లోని సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడటానికి అభిషేక్ శర్మకు మరెంతో సమయం పట్టదు. త్వరలోనే మనం అతడిని టెస్టు జట్టులో చూసే అవకాశం ఉంటుందని హర్బజన్ అభిప్రాయపడ్డాడు. ఈ అబ్బాయి ఆ ఫార్మాట్‌లో కూడా తనదైన శైలిలో షాట్లు కొడతాడని హర్బజన్ చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడని భజ్జీ గుర్తు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అభిషేక్ విధ్వంసకరమైన బ్యాటర్‌గా మారి, మ్యాచ్‌లను వన్ సైడెడ్ చేయగల సత్తా కలిగి ఉన్నాడు. సెహ్వాగ్, రిచర్ట్స్, ట్రావిస్ హెడ్ మాదిరిగా అతను టెస్టు క్రికెట్‌లో రాణిస్తాడని జోస్యం చెప్పాడు. ఒకప్పుడు సెహ్వాగ్, రిచర్డ్స్ తమ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ అలా విధ్వంసం సృష్టిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆ స్థానాన్ని అభిషేక్ శర్మ తీసుకుంటాడని హర్బజన్ సింగ్ అంచనా వేశాడు.

Next Story