- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్‌సీఏ కీలక నిర్ణయం.. హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీతో ఈనెల 15న అరంభమయ్యే మ్యాచ్ కోసం మొత్తం 15 మందితో సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఇటీవలే ఆసియా కప్‌లో అదరగొట్టిన తిలక్ వర్మను జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఇక వైస్ కెప్టెన్‌గా రాహుల్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ రంజీ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ నుంచి సిరాజ్‌కు విశ్రాంతి కల్పించారు. హైదరాబాద్ జట్టులో సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమతేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ తమ స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు. గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బిలో ఆడిన హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌లకు 2 మాత్రమే గెలిచింది. మరో 2 మ్యాచ్‌లను డ్రా చేసుకుని మూడింటిలో ఓడింది. లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కనీసం ఈ సారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం.అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).






