- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA: నిధుల దుర్వినియోగం.. హెచ్‌సీఏపై చర్యలకు బీసీసీఐ అంబూడ్స్‌మన్ ఆదేశం
ఇప్పటికే వరుస వివాదాలతో సతమతమవుతోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association)కే మరో తలనొప్పి వచ్చి పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే వరుస వివాదాలతో సతమతమవుతోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association)కే మరో తలనొప్పి వచ్చి పడింది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తాజాగా హెచ్‌సీఏ(HCA)పై బీసీసీఐ అంబూడ్స్‌మన్ (BCCI Ombudsman)కు ఫిర్యాదు అందింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు, క్రికెట్‌ను పోత్సహించేలా 2018, 2021లో నిధులు కేటాయించాలంటూ హెచ్‌సీఏ (HCA)ను బీసీసీఐ (BCCI) ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ.. గత నాలుగేళ్లుగా తమకు ఎలాంటి నిధులు కేటాయించలేదని కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిండెట్ ఆగంరావు (Aagam Rao) ఆరోపించారు. అదేవిధంగా బీసీసీఐ ఇచ్చిన సిఫార్సులను పాటించలేదని ఈ నెల 8న ఆగంరావు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, బీసీసీఐ అంబూడ్స్‌మెన్ అరుణ్ కుమార్ మిశ్రా (Arun Kumar Mishra)కు లేఖ రాశారు. హెచ్‌సీఏ కేటాయించిన నిధులతో సహా జిల్లాల్లో క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అందులో ప్రస్తావించారు. ఈ మేరకు ఆ లేఖపై విచారణ జరిపిన బీసీసీఐ అంబూడ్స్‌మెన్.. నిబంధనల మేరకు వెంటనే హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేశారు.






