- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్‌సీఏలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్.. ప్లేయర్లపై చర్యలు లేవంటూ పోలీసులకు ఫిర్యాదు
హెచ్‌సీఏలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపాయి. ఇవి చూపించిన ప్లేయర్లపై చర్యలు లేవంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, స్పోర్ట్స్ :హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపాయి. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్న కొందరు ప్లేయర్లు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లతో మోసాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబుకు కరీంనగర్‌కు చెందిన అనంతరెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఉప్పల్ సీఐ కే భాస్కర్‌కు కమిషనర్ సుధీర్ బాబు ఆదేశించారు. గతంలో కూడా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లతో కొందరు ప్లేయర్లు అండర్-16 , అండర్-19 , అండర్-23 లీగ్ మ్యాచ్‌లు ఆడారని, అలా చేసిన వారిని బ్యాన్ చేయాలని 2024లోనే హైకోర్టు ఆదేశించిందని అనంత రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే హెచ్‌సీఏ ఈ ఆదేశాలు పాటించకుండా ఆ ప్లేయర్లను లీగ్ ఆడించిందని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం వల్ల అర్హత ఉన్న ప్లేయర్లు అవకాశాలు కోల్పోతున్నారన్నారు.






