- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్..హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!
ఐపీఎల్ 2026లో కొన్ని ప్రారంభ మ్యాచ్ లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు హేజిల్, కమిన్స్ ఇద్దరు కూడా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు RCB, SRH జట్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 లో కొన్ని ప్రారంభ మ్యాచ్ లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు హేజిల్ వుడ్ (Josh Hazlewood), ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) ఇద్దరు కూడా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ జట్టుకు ఆడుతున్న హేజిల్ వుడ్ తొలి రెండు మ్యాచ్ లు ఆడకపోవచ్చు అని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అదే సమయంలో హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కూడా రెండు నుంచి మూడు మ్యాచ్ లు ఆడకపోవచ్చు అని అంటున్నారు. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరమయ్యారు. ఇక హేజిల్ వుడ్ స్థానంలో జాకోబ్ డఫీ బయలు దిగే ఛాన్స్ ఉంది. అట్ హైదరాబాద్ కెప్టెన్ గా కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ కు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ప్రారంభం మ్యాచ్ హైదరాబాద్, బెంగళూరు మధ్య జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి మ్యాచ్ ఉంటుంది.






