- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో వన్డే కూడా న్యూజీలాండ్‌దే
293 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 41.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

- పాక్‌పై 84 పరుగుల తేడాతో విజయం
- రాణించిన హిచెల్ హే, బెన్ సియర్స్
- మరో వన్డే ఉండగానే సిరీస్ కివీస్ కైవసం
దిశ, స్పోర్ట్స్: హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌పై న్యూజీలాండ్ జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలి ఉండగానే కివీస్ జట్టు 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు నిక్ కెల్లీ (31), రైస్ (18) తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో 26.3 ఓవర్లలో 132 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మహ్మద్ అబ్బాస్ (41)తో కలిసి మిచెల్ హే (99) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అబ్బాయ్ అయివైన తర్వాత మిచెల్ హే గొప్ప పరిణితితో ఆడాడు. చివరి వరకు క్రీజ్‌లోనే ఉండి 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నా.. కివీస్ భారీ పరుగులు సాధించడంలో కీలకంగా నిలిచాడు. దీంతో 50 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది.
ఇక 293 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 41.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెన్ సియర్స్ తన అద్భుత బౌలింగ్‌తో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను నాశనం చేశాడు. అబ్దుల్లా షఫీక్ (1), ఇమామ్ ఉల్ హక్ (3), బాబర్ అజామ్ (1), మహ్మద్ రిజ్వాన్ (5), సల్మాన్ అఘా (9), తయ్యబ్ తాహిర్ (13) తక్కువ స్కోర్లకే పెవీలియన్ చేరడంతో 65 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఫహీమ్ అష్రఫ్ (73), నసీమ్ షా (51) ఆఖర్లో పోరాడినప్పటికీ చివరి వరకు నిలబడలేకపోయారు. హరీస్ రవూఫ్ తలకు దెబ్బతగలడంతో కంకషన్ సబ్‌గా వచ్చిన నసీమ్ షా చివర్లో పోరాడాడు. కానీ సియర్స్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆ జోడీని విడతీశాడు. దీంతో పాకిస్తాన్ జట్టు 41.2 ఓవర్లలోనే 208 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెన్ సియర్స్‌కు 5 వికెట్లు లభించాయి. మిచెల్ హేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్ బోర్డు : న్యూజీలాండ్ 292/8 (50 ఓవర్లు), పాకిస్తాన్ 208 ఆలౌట్ (41.2 ఓవర్లు)






