- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో వన్డేలో శ్రీలంక గెలుపు.. సిరీస్ కైవసం
జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆతిథ్య శ్రీలంక జట్టు కైవసమైంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆతిథ్య శ్రీలంక జట్టు కైవసమైంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో వన్డేలో శ్రీలంక జట్టు విజయం సాధించింది. గురువారం కొలంబో వేదికగా జరిగిన మూడో వన్డేలో జింబాబ్వేపై 8 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో సొంతం చేసుకుంది. మూడో వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. అయితే, శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ స్పిన్ మాయలో చిక్కుకుని జింబాబ్వే బ్యాటర్లు విలవిలాడారు. 7 వికెట్లతో చెలరేగిన అతను ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. దీంతో జింబాబ్వే 22.5 ఓవర్లలోనే 96 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ చెప్పుకోద్దగ స్కోరు చేయలేదు. ఓపెనర్ జాయ్‌లార్డ్ గుంబీ చేసిన 29 పరుగుల టాప్ స్కోర్. అనంతరం 97 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. అయితే, ఛేదనలో లంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(0), షెవాన్ డేనియల్(12) నిరాశపర్చగా.. కుసాల్ మెండిస్(66 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిసి జట్టును విజయ తీరాలకు చేరాడు.






