ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. రంగంలోకి భయంకరమైన ప్లేయర్

by velandi.Saikiran |

టీం ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 20వ

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. రంగంలోకి భయంకరమైన ప్లేయర్
X

దిశ, వెబ్ డెస్క్: టీం ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 20వ తేదీ అంటే మరో మూడు రోజుల్లోనే ఈ ఐదు టెస్టుల సిరీస్ (Test Series) ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. గిల్ ( Shubhman Gill) సారధ్యంలో దుమ్ము లేపేందుకు సిద్ధమైంది టీమిండియా..

రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli) లాంటి సీనియర్ ప్లేయర్లు లేకపోయినా... ఇంగ్లాండ్ ను ఓడిస్తామని యంగ్ క్రికెటర్లు కూడా చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు భారీ ఊరట లభించింది. ఐదు టెస్టుల సిరీస్ (Test Series) కోసం టీమ్ ఇండియా బౌలర్... ఇంగ్లాండ్ లో దిగాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఇప్పటికే 18 మందిని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్ట్ చేసింది.

ఇప్పుడు 19వ ప్లేయర్ గా హర్షిత్ రానాను ( Harshith Rana)బరిలోకి దించబోతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా A జట్టుమొత్తం భారత్ బయలుదేరినప్పటికీ హర్షిత్ రానా మాత్రం ఇంగ్లాండ్ లోనే ఉన్నాడని అంటున్నారు. ఇది ఇలా ఉండగా తొలి మ్యాచ్ కోసం ఐదుగురు బౌలర్లను ఆడించాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story