ఇండియాకు హర్షిత్ రాణా.. భారత టెస్టు నుంచి రిలీజ్

by Harish |

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టు నుంచి యువ పేసర్ హర్షిత్ రాణా‌ను టీమ్ మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసింది.

ఇండియాకు హర్షిత్ రాణా.. భారత టెస్టు నుంచి రిలీజ్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టు నుంచి యువ పేసర్ హర్షిత్ రాణా‌ను టీమ్ మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసినట్టు బీసీసీఐ వర్గాలు బుధవారం తెలిపాయి. రెండో టెస్టు కోసం భారత జట్టుతో కలిసి రాణా బర్మింగ్‌హామ్‌కు వెళ్లడం లేదని పేర్కొన్నాయి. బుధవారం భారత ఆటగాళ్లు బర్మింగ్‌హామ్‌కు వెళ్లారు. మొదట ఇంగ్లాండ్ టూరుకు ప్రకటించిన భారత జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కలేదు. కానీ, జట్టులోని ఓ ఆటగాడు గాయపడటంతో రాణాను బ్యాకప్ పేసర్‌గా తీసుకున్నారు. అయితే, ఆ గాయపడిన ఆటగాడు కోలుకున్నట్టు గంభీర్ తొలి టెస్టు అనంతరం ధ్రువీకరించాడు. రాణా స్వదేశానికి వెళ్తాడని కూడా చెప్పాడు. ఆ మరుసటి రోజే అతన్ని టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు నుంచి విడుదల చేసింది. ఇప్పటికే బెంచ్‌పై ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి పేసర్లు ఉండటంతో రాణా అవసరం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు.


Next Story