- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్‌ఆర్‌హెచ్ మాజీ క్రికెటర్‌కు ఇంగ్లాండ్ పగ్గాలు.. వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా బ్రూక్
ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నియామకమయ్యాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ధ్రువీకరించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బట్లర్ కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా బట్లర్ స్థానంలో ఈసీబీ వైస్ కెప్టెన్ బ్రూక్‌కు ప్రమోషన్ ఇచ్చింది. వన్డే, టీ20 పగ్గాలు అప్పగించింది.
‘ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ అవడం చాలా గర్వకారణం. చిన్నతనంలో యార్క్‌షైర్, ఇంగ్లాండ్‌కు ఆడాలని, జట్టును నడిపించాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. నాకు అడుడగడున మద్దతుగా నిలిచిన కుటుంబానికి, కోచ్‌లకు ధన్యవాదాలు. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఇంగ్లాండ్ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తా.’ అని బ్రూక్ తెలిపాడు.
2022లో అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్‌లోకి బ్రూక్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 26 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. 2022 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో అతను సభ్యుడు. గతేడాది నుంచి ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్లకు బ్రూక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది బట్లర్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2018 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టును నడిపించిన అనుభవం ఉంది. మేలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో బ్రూక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టును బెన్ స్టోక్స్ నడిపిస్తున్నాడు.
బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వాహకులు రెండేళ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. వేలంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు దక్కించుకుంది. అయితే, జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అతను ఐపీఎల్ ప్రారంభానికి ముందు తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ఐపీఎల్ కొత్తగా తీసుకొచ్చిన రూల్ ప్రకారం..వేలంలో ఎంపికైన తర్వాత ఏ ప్లేయర్ అయినా లీగ్ నుంచి స్వయంగా తప్పుకుంటే రెండేళ్లపాటు బ్యాన్ విధించొచ్చు. ఈ క్రమంలోనే అతనిపై బీసీసీఐ వేటు వేసింది. దీంతో బ్రూక్ వచ్చే సీజన్‌తోపాటు 2027కు దూరం కానున్నాడు. 2023లో బ్రూక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
- Tags
- Harry Brook






