- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యారీ బ్రూక్ హిస్టరీ..వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన మొనగాడు
పురుషుల T20 ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ సాధించని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్ గా కొనసాగుతూ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్. పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా హ్యారీ బ్రూక్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. సెంచరీ చేయడమే కాదు, ఇంగ్లాండ్ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు హ్యారీ బ్రూక్. దీంతో కెప్టెన్ గా సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ పైన జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు హ్యారీ బ్రూక్.
కెప్టెన్ గా ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్లే
టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో కెప్టెన్ హోదాలో ఉండి ఇప్పటి వరకు ఒకే మ్యాచ్ ల ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే, ఈ లిస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ( Harry Brook) మొదటి వరుసలో ఉంటాడు. మంగళవారం జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా సరిగ్గా 100 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు పైన ఉండేది. 2010 సమయంలో టీ20 ప్రపంచ కప్ జరిగింది. అప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ గా ఉన్న క్రిస్ గేల్, 98 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ పరుగులు సాధించాడు క్రిస్ గేల్.
ఆ తర్వాత ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ ( Lorcan Tucker) మూడో స్థానంలో ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఒమాన్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టక్కర్ 94 పరుగులతో ఇరగదీశాడు. ఇక నాలుగో స్థానంలో మన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 92 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఐదవ స్థానంలో క్రిస్ గేల్ ఉన్నారు. ఆస్ట్రేలియా పైన వెస్టిండీస్ కెప్టెన్ గా గతంలో ఉన్న క్రిస్ గేల్ 88 పరుగులు సాధించారు. కానీ ఇప్పటి వరకు గ్రూప్ తరహాలో ఎవరూ కూడా కెప్టెన్ హోదాలో సెంచరీ నమోదు చేయలేదు. కేవలం ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ మాత్రమే, ఈ టీ20 వరల్డ్ కప్ సమయంలోనే సాధించాడు.
🚨 HISTORY CREATED BY BROOK. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2026
- Harry Brook becomes the first captain men’s T20 World Cup to score a hundred. pic.twitter.com/a2qBwDPkgQ






