- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Icc Rankings : స్మృతి మంధాన, హర్మన్ ర్యాంక్‌లు డౌన్
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తమ వన్డే ర్యాంక్‌లను నిలబెట్టుకోలేకపోయారు.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తమ వన్డే ర్యాంక్‌లను నిలబెట్టుకోలేకపోయారు. మంగళవారం ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన ఒక్క స్థానం దిగజారి 5వ ర్యాంక్‌కు పడిపోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్-10లో చోటు కోల్పోయింది. రెండు స్థానాలు కోల్పోయి 11వ స్థానంలో నిలిచింది. అయితే, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. రోడ్రిగ్స్ 3 స్థానాలు అధిగమించి 28వ ర్యాంక్‌కు, రిచా 7 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంక్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ తిరిగి నం.1 బ్యాటర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. బౌలింగ్ విభాగంలో ఆసిస్ బౌలర్ సుదర్లాండ్ ఏకంగ 23 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడు విభాగాల్లోనూ ర్యాంక్‌ను కాపాడుకోలేకపోయింది. బ్యాటింగ్ విభాగంలో 7 ర్యాంక్‌లు దిగజారి 27వ స్థానానికి పడిపోయింది. అలాగే, బౌలింగ్ విభాగంలో ఒక్క స్థానం కోల్పోయి 3వ ర్యాంక్‌కు, ఆల్‌రౌండర్ విభాగంలో 2 స్థానాలు కోల్పోయి 6వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్‌పై సత్తాచాటిన ఆసిస్ బౌలర్ సుదర్లాండ్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకుంది.






