పాపం పాండ్యా... నటాషా ప్రియుడు కొడుకు షికార్లు!

by velandi.Saikiran |

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ( hardik pandya ) వచ్చిన కష్టం ఏ ఒక్కరికి రాకూడదని అందరూ అంటున్నారు.

పాపం పాండ్యా... నటాషా ప్రియుడు కొడుకు షికార్లు!
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ( hardik pandya ) వచ్చిన కష్టం ఏ ఒక్కరికి రాకూడదని అందరూ అంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల విడాకులు తీసుకున్న ఆయన భార్య నటాషా స్టాంకోవిక్ ( Natasha Stankovic).... వేరే వ్యక్తితో తిరగడం మొదలుపెట్టింది. బ్రదర్ అంటూనే.. అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో.. చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది నటాషా. అది చాలదంటూ... ఇద్దరు కలిసి పార్టీలకు అలాగే పబ్బులకు కూడా వెళ్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక లేటెస్ట్ గా... హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యా ను కూడా మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ ( Aleksandar Alex Ilic) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఈవెంట్ కు వెళ్తూ పాండ్యా కొడుకును కూడా తీసుకువెళ్లాడు. తన పక్కనే కూర్చోబెట్టుకొని... తండ్రిలా ఫీల్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన హార్దిక్ పాండ్యా ఫాన్స్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏంట్రా మా పాండ్యా కొడుకుని పట్టుకొని ఎక్కడికి వెళ్లావు...? నువ్వు మాకు దొరికితే చచ్చిపోతావ్ అంటూ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కు వార్నింగ్ ఇస్తున్నారు. వెంటనే హార్దిక్ పాండ్యా కుటుంబాన్ని వదిలేసి దూరం వెళ్ళిపో అంటూ హెచ్చరికలు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్. అయితే మరి కొంత మంది మాత్రం అతడు ప్రియుడు కాదని... కేవలం నటాషాకు ఫ్రెండ్ మాత్రమే అంటున్నారు. దిశా పటాని తో కూడా ఇలా క్లోజ్ గా ఉంటాడని అంటున్నారు.

Next Story