IND VS ENG : పాండ్యా చేసిన తప్పిదానికి మూల్యం చెల్లించుకున్న దూబె.. వెంటనే సారీ చెప్పిన హార్దిక్

by Harish |

IND VS ENG : పాండ్యా చేసిన తప్పిదానికి మూల్యం చెల్లించుకున్న దూబె.. వెంటనే సారీ చెప్పిన హార్దిక్
X

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. శాంసన్(89) మరోసారి అదరగొట్టగా, శివమ్ దూబె(43), ఇషాన్ కిషన్(39), పాండ్యా(27), తిలక్(21) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 రన్స్ చేసింది. అయితే, శివమ్ దూబె రనౌటైన తీరు చాలా బాధాకరం. పాండ్యా పొరపాటుతో అతను పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 18వ ఓవర్ వేసిన సామ్ కర్రన్ మూడో బంతిని యార్కర్ సంధించగా పాండ్యా చక్కగా డిఫెన్స్ చేసుకున్నాడు. అలాగే సింగిల్ కోసం దూబెను రమ్మన్నాడు. దీంతో దూబె పరుగు కోసం పిచ్ మధ్య వరకు రాగా పాండ్యా మాత్రం రాలేదు. తిరిగి నాన్ స్ట్రైకింగ్‌కు వెళ్లే లోపు హ్యారీ బ్రూక్ అద్భుతమైన త్రోతో వికెట్ల పడగొట్టాడు. తన తప్పును తెలుసుకున్న పాండ్యా వెంటనే దూబెకు క్షమాపణలు చెప్పాడు. తన తప్పిదం లేకుండా పెవిలియన్ చేరిన దూబె తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అతను అవుటయ్యే కంటే మంచి ఫామ్ కనబరిచాడు. 4 సిక్సర్లు కొట్టాడు. 43 రన్స్ చేసి దూబె హాఫ్ సెంచరీకి 7 రన్స్ దూరంలో ఆగిపోయాడు.

Next Story