MI VS GT: T20 వరల్డ్ కప్ లుక్ లో హార్దిక్ పాండ్యా.. అంటే ఈ లెక్కన

by velandi.Saikiran |   (  Updated:2025-05-29 20:30:03  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) చివరి దశకు వచ్చింది. ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో

MI VS GT: T20 వరల్డ్ కప్ లుక్ లో హార్దిక్ పాండ్యా.. అంటే ఈ లెక్కన
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) చివరి దశకు వచ్చింది. ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. చండీగఢ్ లోని ముల్లన్పూర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు... బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ మ్యాచ్ కంటే ముందు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త హెయిర్ స్టైల్ తో... ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతున్నాడు హార్థిక్ పాండ్యా. టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ లో ఏదైతే హెయిర్ స్టైల్ చేయించుకున్నాడో... ఇప్పుడు కూడా.. అచ్చం అలాంటి హెయిర్ స్టైల్ తో మెరిశాడు.

దీంతో అప్పుడు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకొని టోర్నమెంట్ లో సక్సెస్ అయిన హార్దిక్ పాండ్యా... ఇప్పుడు మళ్లీ ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో సక్సెస్ అవుతాడని... సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అప్పటి సెంటిమెంట్ మళ్లీ ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందని.. అందుకే ఇలా హెయిర్ సెట్ చేయించుకున్నాడని.. చెబుతున్నారు అభిమానులు.

Next Story