కొత్త‌ ప్రియురాలి ఫోటో షేర్ చేసిన‌ హార్దిక్‌ పాండ్యా

by velandi.Saikiran |

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అదిరిపోయే ప్రకటన చేశాడు. తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు హార్థిక్

కొత్త‌ ప్రియురాలి ఫోటో షేర్ చేసిన‌ హార్దిక్‌ పాండ్యా
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అదిరిపోయే ప్రకటన చేశాడు. తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు హార్థిక్ పాండ్యా. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మోడల్ మహికా శర్మ ( Mahika Sharma )తో రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు నిజమేనని ఈ ఒక్క పోస్టుతో తేల్చి పడేశాడు. న‌టాషాకు విడాకులు ఇచ్చిన‌ తర్వాత, ఈ మహికా శర్మతో రిలేషన్ లో ఉన్నట్లు కుండబద్దలు కొట్టాడు.

అంతేకాదు ఒకరోజు ముందే మహికా శర్మతో కలిసి హార్దిక్ తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం. ఇందులో భాగంగానే బీచ్ ఒడ్డున తన ప్రియురాలితో రొమాంటిక్ ఫోటోను కూడా దిగి సోషల్ మీడియాలో పెట్టేసాడు. ఆమెతో కలిసి చిల్ అవుతున్న ఫోటోలను పంచుకున్నాడు. దీంతో మహికా శర్మతో హార్దిక్ పాండ్యా రిలేషన్ లో ఉన్నట్లు తేలిపోయింది. ఇది ఇలా ఉండగా సెర్బియా నటి నటాషాకు ఇటీవల పాండ్యా విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Next Story