- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మియామి ఓపెన్ విజేత మెద్వెదేవ్
by Javid Pasha |
రష్యా టెన్నిస్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్ మియామి ఓపెన్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

X
సౌత్ ఫ్లొరిడా: రష్యా టెన్నిస్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్ మియామి ఓపెన్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో మెద్వెదేవ్ 7-5, 6-3తో ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్‌ను చిత్తు చేశాడు. ఈ ఏడాదిలో మెద్వెదేవ్‌కు ఇది నాలుగోది కాగా.. ఓవరాల్‌గా 19వ టైటిల్. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్ తర్వాత దోహా, రోటర్‌డామ్, దుబాయ్ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు. తాను చాలా అదృష్టవంతుడనని రష్యా ప్లేయర్ అన్నాడు.
ఎందుకంటే సెమీఫైనల్లో అల్కరాజ్‌ను మూడు సెట్లలోనే సిన్నర్ చిత్తు చేశాడని చెప్పాడు. ‘కార్లోస్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా అద్భుతమైన మ్యాచ్’ అని ట్రోఫీ సెరిమనీలో మెద్వెదేవ్ చెప్పాడు. 1.3 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు.
Next Story






