ఆ పాకిస్తాన్ ఆటగాడితో జాగ్రత్త.. టీమిండియా ప్లేయర్లకు హర్భజన్ హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-19 04:17:19  IST  )

ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నేడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy-2025) ప్రారంభం కాబోతోంది.

ఆ పాకిస్తాన్ ఆటగాడితో జాగ్రత్త.. టీమిండియా ప్లేయర్లకు హర్భజన్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నేడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy-2025) ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్‌(Pakistan)లో కరాచీ మైదానం(Karachi Ground) వేదికగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఈనెల 23వ తేదీన మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లను మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్(Harbhajan Singh) హెచ్చరించారు. పాక్ ఆటగాడు ఫకర్ జమాన్(Faqar Zaman) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత్‌పై జమాన్‌కు అద్భుతమైన రికార్డు ఉందని.. గతంలో మన విజయాల్ని చాలా అతను దూరం చేశాడు. ఇప్పటివరకు భారత్‌పై ఆరు మ్యాచులు ఆడిన ఫకర్ జమాన్.. 46.80 సగటుతో 234 చేశారు.


అయితే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. టీమిండియా అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ముందుగా ఈనెల 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న, న్యూజిల్యాండ్‌తో మార్చ్‌ 2న ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుంది. మార్చి 4వ తేదీన మొదటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. గ్రూప్‌-బీలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు ఉన్నాయి. భారత జట్టు సెమీస్‌కు చేరితో వీటిలో ఏదో ఒక టీమ్‌తో సెమీస్‌లో తలపడనుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ మర్చ్‌ 9న జరగనుంది. టీమిండియా సెమీ ఫైనల్‌, ఫైనల్‌కు వరకు వెళ్తే.. ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి.

Next Story