హ‌ర్భ‌జ‌న్ సింగ్ కు బీసీసీఐ కీల‌క ప‌ద‌వి..!

by velandi.Saikiran |

హర్భజన్ సింగ్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు BCCI కీలక పదవి

హ‌ర్భ‌జ‌న్ సింగ్ కు బీసీసీఐ కీల‌క ప‌ద‌వి..!
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ కు ( Harbhajan Singh) అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి లో( BCCI) కీలక పదవి దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్.... లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసినట్లు చెబుతున్నారు.

ఈ మేరకు ఆయన ఈ నెల 28వ తేదీన జరగనున్న ఏజీఎం సమావేశానికి హాజరు కాబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మరి ఇందులో హర్భజన్ సింగ్ కు ఏ పదవి దక్కుతుందో చూడాలి.

Next Story