- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harbhajan Singh: ధోనికి తప్ప ఎవరికీ రియల్ ఫ్యాన్స్ లేరు..అంతా ఫేక్ గాళ్లే
టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు హర్భజన్ సింగ్ ( Harbhajan Singh) హాట్ కామెంట్స్ చేశాడు. హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లతో ధోని

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు హర్భజన్ సింగ్ ( Harbhajan Singh) హాట్ కామెంట్స్ చేశాడు. హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లతో ధోని ( Ms Dhoni) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli) అభిమానుల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. మహేంద్ర సింగ్ ధోనీ కి తప్ప మిగిలిన టీమిండియా క్రికెటర్లు ఎవరికి కూడా రియల్ అభిమానులు లేరని బాంబు పేల్చాడు హర్భజన్ సింగ్.
ధోని కి తప్ప మిగిలిన ప్లేయర్ లందరికీ ఉన్న ఫ్యాన్స్ అందరూ పెయిడ్ అంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. అందరూ డబ్బులు ఇచ్చి ఫాన్స్ ను.. పెంచుకుంటున్నారని చురకలంటించాడు హర్భజన్ సింగ్. మహేంద్ర సింగ్ ధోనీ మరో సీజన్ ఆడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారని వెల్లడించారు. ధోని క్రికెట్ పెద్దగా ఆడకపోయినా.. అతని ఉన్న ఫాలోయింగ్ అస్సలు తగ్గబోదని వివరించాడు. ఆయనకు నిజమైన అభిమానులు ఉన్నారు కాబట్టే అలాంటి పరిస్థితి ఉందన్నాడు.
మిగిలిన క్రికెటర్లు ఎవరైనా అట్టర్ ఫ్లాప్ అయితే.. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గుర్తు చేశాడు. వాళ్లు రియల్ ఫ్యాన్స్ కాదని తెలిపాడు హర్భజన్ సింగ్. అయితే హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లపై... విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. ధోనిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. మహేందర్ సింగ్ ధోని దేశద్రోహి కూడా ప్రచారం చేస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు.
Harbhajan Singh on CSK & MSD fandom Vs other team fandom 😉😉 pic.twitter.com/kUZ0okuELP
— bhupendra (@bhupendra769430) May 17, 2025






