- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"దమ్ముంటే" గెలిచి చూపించండి..పాకిస్తాన్ కు భజ్జీ వార్నింగ్
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ వదులుకోవడంపై హర్భజన్ సింగ్ స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ తప్పుడు నిర్ణయం తీసుకుందని చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. పాకిస్తాన్ తీసుకున్న బహిష్కరణ నిర్ణయంపై ఫైర్ అయ్యారు భజ్జీ.
పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన హర్భజన్
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ వదులుకోవడంపై హర్భజన్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్ కు ఇండియా అవసరం లేదనుకుంటా...? అందుకే ఇండియాతో మ్యాచ్ రిజెక్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని.. పాకిస్తాన్ బహిష్కరణ చేసినా కూడా బీసీసీఐకి ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు హర్భజన్ సింగ్. ఇండియా లేకపోయినా పాకిస్తాన్ పటిష్టంగా ఉంటుందని వాళ్ళ అంచనా... అది ఎప్పుడైనా ప్రమాదమే అంటూ హెచ్చరించారు హర్భజన్. ఇండియాతో పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలని కూడా చురకలు అంటించారు.






