- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ఎస్‌ఆర్‌హెచ్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కమిన్స్ గాయం నుంచి కోలుకోవడంతో త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కమిన్స్ వచ్చినా ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ‘ఇషాన్ కిషన్ నాయకత్వంలో సన్‌రైజర్స్ జట్టు రాణిస్తోంది. బౌలర్లు, ఇతర ప్లేయర్లు అతనితో మంచి సమన్వయం ఏర్పర్చుకున్నారు. కాబట్టి, కెప్టెన్‌గా అతన్నే కొనసాగించడం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉపయోగకరంగా ఉంటుంది.’అని హర్భజన్ సింగ్ తెలిపాడు. మరో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూడా ఇషాన్ కిషన్‌కే మద్దతు తెలిపాడు. ‘ఇషాన్ బౌలర్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఏ బ్యాటర్‌కు ఎవరు బౌలింగ్ చేయాలో అతనికి ఓ క్లారిటీ ఉంది. ఆటను ఎంత బాగా నియంత్రిస్తున్నాడో చెప్పడానికి ఇదొక నిదర్శనం. తీవ్ర ఒత్తిడిలో కూడా అతను సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.’అని సంజయ్ బంగర్ తెలిపాడు.






