- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dommaraju Gukesh : ప్రపంచ చెస్ రారాజుకే చుక్కలు చూపించిన గుకేష్
ప్రపంచ చెస్ ఛాంపియన్ డొమ్మరాజు గుకేష్(Dommaraju Gukesh) ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్(Magnus Carlsen)ను ఓడించి సంచలనం సృష్టించాడు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ చెస్ ఛాంపియన్ డొమ్మరాజు గుకేష్(Dommaraju Gukesh) ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్(Magnus Carlsen)ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఆదివారం నార్వే చెస్ 2025(Norway Chess 2025) టోర్నమెంట్‌లో 6వ రౌండ్‌లో అద్భుతమైన ఆటతీరుతో కార్ల్సెన్‌ను చిత్తు చేశాడు. ఈ విజయం గుకేష్‌కు నార్వేజియన్ గ్రాండ్‌మాస్టర్‌పై తొలి క్లాసికల్ విజయం. రమేష్‌బాబు ప్రజ్ఞానంద తర్వాత ఈ టోర్నమెంట్ చరిత్రలో కార్ల్సెన్‌ను ఓడించిన రెండో భారతీయ ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. మ్యాచ్‌లో ఎక్కువ సమయం కార్ల్సెన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ, చివర్లో అతను స్ట్రెస్ కు గురయ్యాడు. గుకేష్ పట్టుదలతో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించాడు.
ఈ విజయంతో గుకేష్ 8.5 పాయింట్లతో నార్వే చెస్ 2025 పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. కాగా ఈ ఆట చివర్లో కార్ల్సెన్ ఓటమి పాలైన అనంతరం భరించలేక చెస్ టేబుల్ ను బలంగా చేతితో గుద్ది వెళ్ళిపోవడం అతని మానసిక ఒత్తిడిని సూచించింది. గుకేష్ విజయంపై ప్రధాని మోడీ ప్రశంశలు కురిపించారు. 'గుకేష్ అద్భుత విజయం సాధించాడు! అతనికి హృదయపూర్వక అభినందనలు. 2025 నార్వే చెస్ టోర్నమెంట్‌లో 6వ రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్‌ను మొదటిసారి ఓడించి, తన అసాధారణ ప్రతిభ, అంకితభావాన్ని చాటాడు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.' అంటూ మోడీ ట్వీట్ చేశారు.






