- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
103 ఎత్తుల తర్వాత డ్రా.. గుకేష్, దివ్య మధ్య థ్రిల్లింగ్ చెస్ మ్యాచ్
by Phanindra |
ఫిడె గ్రాండ్ స్విస్ టోర్నీలో గుకేష్, దివ్య మధ్య థ్రిల్లింగ్ చెస్ మ్యాచ్ అందర్నీ ఆకట్టుకుంది. ఆరుగంటలపాటు సాగిన ఈ మ్యాచ్ 103 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది.

X
దిశ, స్పోర్ట్స్: ఫిడే గ్రాండ్ స్విస్‌లో అద్భుతమైన మ్యాచ్ చెస్ ప్రియులను కట్టిపడేసింది. వరల్డ్ ఛాంపియన్ డి గుకేష్, మహిళల చెస్ వరల్డ్ కప్ విన్నర్ దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఆరు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు 103 ఎత్తులు వేశారు. కానీ చివరకు మ్యాచ్ డ్రాగా ముగియడం గమనార్హం. శుక్రవారం నాడు సమర్‌కండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుకేష్ వద్ద రూక్, నైట్ మిగలగా.. దివ్య వద్ద కేవలం ఒక రూక్ మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో మ్యాచ్ చాలా ముందుగానే డ్రాగా ముగిసేది. కానీ వ్యూహాత్మకంగా పైచేయిలో ఉన్న గుకేష్.. దివ్య ఏదైనా పొరపాటు చేస్తుందని ఓపికగా ఎదురుచూశాడు. కానీ దివ్య అద్భుతమైన పట్టుదలతోపాటు తన డిఫెన్సివ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంది. చివరకు గుకేష్ డ్రా ఆఫర్ చెయ్యగా.. దివ్య ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకుంది.
Next Story






