- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL.. ఢిల్లీపై గుజరాత్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 2026లో జరిగిన 4వ మ్యాచ్‌లో గుజరాత్ గియంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 2026లో జరిగిన 4వ మ్యాచ్‌లో గుజరాత్ గియంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. జనవరి 11న నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ ఇన్నింగ్స్‌లో సోఫీ డివైన్ అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 95 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో స్నేహ రాణా వేసిన బంతుల్లో వరుసగా 4, 4, 6, 6, 6, 6 బాది ఒక్క ఓవర్‌లోనే 32 పరుగులు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కెప్టెన్ అష్లీ గార్డనర్ కూడా 26 బంతుల్లో 49 పరుగులతో రాణించింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ హాట్రిక్‌తో సహా 5 వికెట్లు తీసి ఆకట్టుకుంది.
లక్ష్య ఛేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 205 పరుగులకు 5 వికెట్లు మాత్రమే కోల్పోయినా, చివరికి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. లారా వోల్వార్డ్ 38 బంతుల్లో 77 పరుగులు చేసి పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సిన సమయంలో సోఫీ డివైన్ కీలక వికెట్లు తీసి గుజరాత్‌కు విజయం అందించింది.
బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసిన సోఫీ డివైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ రెండు మ్యాచ్‌ల్లో రెండు గెలుపులతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.






