- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ గుజరాత్ వర్సెస్ లక్నో మధ్య బిగ్ ఫైట్
ఒకవేళ ఓడితే మొదటి స్థానం నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొదటి స్థానంలో ఉన్న జట్టుకు.. అడ్వాంటేజ్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో మధ్య ఫైట్ ఉంటుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా... గుజరాత్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ గుజరాత్ కు చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్... అలాగే ముందుకు వెళ్లాలంటే ఇవాల్టి మ్యాచ్ కూడా గెలవాలి.
ఒకవేళ ఓడితే మొదటి స్థానం నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొదటి స్థానంలో ఉన్న జట్టుకు.. అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. నాకౌట్ స్టేజిలో...ఓడినా ఒక ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవాల్టి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మళ్ళీ అదే.. మొదటి స్థానంలో నిలుస్తుంది. లక్నో... మాత్రం పరువు కోసం ఇవాల్టి మ్యాచ్ లో గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పంత్... చివరి మ్యాచ్ లలో నైనా మెరుస్తాడని అందరూ ఆశిస్తున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఇరు జట్ల అంచనా
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికె), షెర్ఫానే రూథర్ ఫోర్డ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c&wk), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, విలియం ఒరూర్కే






