గుజరాత్ కీలక నిర్ణయం.. ఇక పై కొత్త జెర్సీతోనే మ్యాచ్ లు !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) కీలక నిర్ణయం

గుజరాత్ కీలక నిర్ణయం.. ఇక పై కొత్త జెర్సీతోనే మ్యాచ్ లు !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) కీలక నిర్ణయం తీసుకుంది. జెర్సీ రంగు మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది గుజరాత్ టైటాన్స్. ఈ నెల 22వ తేదీన... గుజరాత్ టైటాన్స్ తన తర్వాతి మ్యాచ్ ఆడబోతోంది. అది కూడా లక్నోతో ( Lucknow Super Giants ) తలపడుతుంది గుజరాత్ టైటాన్స్. అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో... కొత్త జెర్సీతో దర్శనం ఇవ్వనుంది గుజరాత్ టైటాన్స్ టీం.

ఆ రోజున లావెండర్ కలర్ జెర్సీలో ( special lavender jersey ) గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు దర్శనం ఇస్తారు. క్యాన్సర్ వ్యాధిపై ( Cancer) అవగాహన ప్రచారంలో భాగంగా గుజరాత్ ప్లేయర్స్ ప్రతి సంవత్సరం ఓ మ్యాచ్ కు ఇలాగే లావెండర్ జెర్సీలు ధరించుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. జరిగే మ్యాచ్ లో ఈ కొత్త జెర్సీతో కనిపించబోతున్నారు ప్లేయర్లు. కాగా మే 22వ తేదీన జరగాల్సిన గుజరాత్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్... మోడీ స్టేడియం లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 16 పాయింట్లు దక్కించుకున్న గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.

Next Story