భారత జట్టు సెలక్షన్ పై విమర్శలు.. అది గుజరాత్ టైటాన్స్ అంటూ

by velandi.Saikiran |

సెలెక్ట్ చేసిన టీమ్స్ లో అందరూ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు మాత్రమే ఉన్నారని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

భారత జట్టు సెలక్షన్ పై విమర్శలు.. అది గుజరాత్ టైటాన్స్ అంటూ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య ఓ టెస్ట్, 3 వన్డేలు జరగనున్నాయి. జూన్ 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. ఐపీఎల్ ముగియగానే ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇలాంటి క్రమంలో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఒక టెస్ట్ తో పాటు మూడు వన్డేలకు జట్టును ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలెక్ట్ చేసిన టీమ్స్ లో అందరూ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు మాత్రమే ఉన్నారని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

టెస్ట్ కోసం ఫైనల్ చేసిన జట్టులో మొత్తం ఏడుగురు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు ఉండగా... వన్డే జట్టులో నలుగురు వాళ్లే ఉన్నారు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జట్ల ఎంపిక విషయంలో తీవ్ర వివక్ష జరిగిందని మండిపడుతున్నారు. ఈ కుట్ర వెనుక గిల్, గంభీర్ ఉన్నారంటూ సీరియస్ అవుతున్నారు. కొత్త ప్లేయర్లతో మళ్ళీ జట్లను ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు దీనిపై ఇర్ఫాన్ పఠాన్ కూడా సీరియస్ అయ్యారు. రంజిత్ ట్రోఫీలలో అద్భుతంగా ఆడిన ప్లేయర్లను పట్టించుకోలేదని.. వాళ్లను సెలెక్ట్ చేయలేదని ఆగ్రహించారు.

Next Story