WPL 2023: పోరాడి ఓడిన RCB.. మొదటి విక్టరి సాధించిన గుజరాత్..

by Disha Web Desk 12 |
WPL 2023: పోరాడి ఓడిన RCB.. మొదటి విక్టరి సాధించిన గుజరాత్..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2023లో గుజరాత్ జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబై వెదికగా జరిగిన 8వ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది డంక్లీ(65), హర్లీన్ డియోల్(67) మెరుపు అర్ధసెంచరీలతో మెరిసారు. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన RCB జట్టు చివరి వరకు పోరాడి 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగుల తేడాతో గెలిచి.. ఈ సీజన్ లో తమ మొదటి విజయాన్ని అందుకుంది. కాగా RCB జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం విశేషం. గుజరాత్ బౌలర్లలో ఆశ్లే గార్డ్నర్ 3 వికెట్లు తీయగా, అన్నాబెల్ సుథెర్లాండ్ 2 వికెట్లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. 28 బంతుల్లోనే 65 పరుగులు చేసిన గుజరాత్ బ్యాటర్ సోఫియా డంక్లీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

Next Story