మారని తెలుగు టైటాన్స్ తీరు.. గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి

by Dishanational5 |
మారని తెలుగు టైటాన్స్ తీరు.. గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను 30-37 తేడాతో గుజరాత్ జెయింట్స్ ఓడించింది. మొదట ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌దే పైచేయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఆ జట్టు 19-14తో ఆధిక్యంలో ఉంది.అయితే, సెకండాఫ్‌లో పట్టు కోల్పోయింది. ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఆలౌటైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ వరుస పాయింట్లతో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రాకేశ్ 10 పాయింట్లు, దీపక్ సింగ్ 9 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ తరపున కెప్టెన్ పవన్ 8 పాయింట్లు, సంజీవి 7 పాయింట్లతో పోరాడినప్పటికీ.. మిగతా ప్లేయర్ల నుంచి సహకారం కరువైంది. మరోవైపు, టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా యు ముంబాను 31-41 తేడాతో ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది.


Next Story