- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీల్డింగ్ కోచ్‌గా ‘లేడీ ధోనీ’.. అపాయింట్ చేసిన గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా ‘లేడీ ధోనీ’ని అపాయింట్ చేశారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ మాజీ లెజెండ్ సారా టేలర్‌ను తమ టీం ఫీల్డింగ్ కోచ్‌గా నియమించినట్లు గుజరాత్ జెయింట్స్ ప్రకటించింది. అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో ‘లేడీ ధోనీ’గా పేరొందిన టేలర్ రాకతో డబ్ల్యూపీఎల్ 2026లో తమ ఫీల్డింగ్ మెరుగవుతుందని ఈ ఫ్రాంచైజీ నమ్ముతోంది. ఇప్పటికే హెడ్‌కోచ్‌గా మైఖేల్ క్లింగర్, బౌలింగ్ కోచ్‌గా ప్రవీణ్ తంబే, అనలిస్ట్‌గా సౌరభ్ వాకర్‌ను నియమించుకున్న గుజరాత్.. టేలర్ రాకతో తమ కోచింగ్ విభాగం కూడా బలోపేతం అవుతుందని చెప్తోంది. ఇంగ్లండ్ తరఫున 13 ఏళ్లు ఆడిన సారా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 226 మ్యాచులు ఆడి 6500పైగా పరుగులు సాధించింది. వికెట్ కీపర్‌గా అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్‌తో అందరి మన్ననలు పొందిన ఆమె.. ధోనీలాగే లైట్నింగ్ ఫాస్ట్ రిఫ్లెక్స్‌లకు పెట్టింది పేరు. 2019లో రిటైర్ అయ్యే సమయానికి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్లలో ధోనీ, సంగక్కర తర్వాత మూడో స్థానంలో నిలిచిందామె. గతేడాది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆమెను చేర్చారు.






