GT Vs CSK: ఆరు వికెట్లు డౌన్.. ఓటమి దిశగా చెన్నై సూపర్ కింగ్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-21 17:25:00  IST  )

ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై టాపార్డర్ చేతులెత్తేసింది.

GT Vs CSK: ఆరు వికెట్లు డౌన్.. ఓటమి దిశగా చెన్నై సూపర్ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL 2026)‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్లు చెలరేగిపోయారు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరుగుతున్న ఈ కీలక పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అత్యధికంగా 84 పరుగులు చేసి చెన్నై బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు.

మెరుపులు మెరిపించిన జోస్ బట్లర్..

ఓపెనర్లు అవుటైన తర్వాత కూడా గుజరాత్ రన్ రేట్ తగ్గలేదు. మిడిలార్డర్‌లో వచ్చిన జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై క్యాంప్‌లో వణుకు పుట్టించాడు. కేవలం 27 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

సిరాజ్ త్రిపుల్ స్ట్రైక్.. కష్టాల్లో చెన్నై చేజింగ్

భారీ టార్గె‌ట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. రుతురాజ్ గైక్వాడ్ (16) పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ కాగా, ఉర్విల్ పటేల్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. సంజూ శాంసన్ కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే వేగంగా సిక్సర్లు బాదుతూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చెన్నై‌ ఈ మ్యాచ్ గెలవాలంటే 51 బంతుల్లో 96 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మాత్రం మరో 4 వికెట్లు మాత్రమే ఉండటంతో దాదాపు చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది.

Next Story