- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH అభిమానులకు గుడ్‌న్యూస్.. జట్టు కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ నియామకం
IPL-2026 సమరానికి సమయం సమీపిస్తున్న వేళ సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతుండటంతో, అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. అయితే, పాట్ కమిన్స్ అందుబాటులోకి వచ్చే వరకు ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నారు.
అదేవిధంగా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు జట్టును ముందుండి నడిపించనున్నారు. ప్రస్తుతం వెన్నునొప్పి కారణంగా తన స్వదేశంలో వైద్యలు పర్యవేక్షణలో ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టులో చేరుతారని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే తొలి పోరులో సన్‌రైజర్స్ ఆర్మీని ఇషాన్ కిషన్ నడిపించనున్నారు. యువ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎస్ఆర్‌హెచ్ కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్ దూకుడైన కెప్టెన్సీ జట్టుకు ఎంతవరకు కలిసి వస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే మరి.






