- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 : SRH ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
SRH ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త. ఈనెల 17 నుంచి రీ స్టార్ట్ కానున్న IPL కోసం SRH స్టార్ ప్లేయర్స్ ఇండియాకు రానున్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : SRH ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త. ఈనెల 17 నుంచి రీ స్టార్ట్ కానున్న IPL కోసం SRH స్టార్ ప్లేయర్స్ ఇండియాకు రానున్నట్టు సమాచారం. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) తోపాటు, ట్రావీస్ హెడ్(Travis Head) టీంలో జాయిన్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత్ - పాకిస్తాన్(Bharat - Pakistan) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్(IPL) అకస్మాత్తుగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. యుద్ధ భయంతో అన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు వారి దేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం జరుగడంతో ఐపీఎల్ పున:ప్రారంభం(IPL Re Start)పై బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది. మే 17వ తేదీ నుంచి జూన్ 3 వరకు మిగిలిన మ్యాచులు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. అయితే తమకు రక్షణ ఉంటుందో లేదోనని తిరిగి భారత్ కు రావడానికి ప్లేయర్స్ సంకోచించినట్టు వార్తలు వచ్చాయి.
అన్ని జట్ల నిర్వహకులు క్రికెటర్స్ వచ్చి టీంలో జాయిన్ అవ్వాలని చెప్పినప్పటికీ అనేకమంది ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్ జట్టులోని కీలక ఆటగాళ్లు కూడా వారి దేశాలకు వెళ్ళగా.. వారిని వెనక్కి రప్పించే పనిలో పడ్డారు టీం నిర్వాహకులు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు కమిన్స్, హెడ్ తోపాటు కొయేట్జీ, ఎంగిడి, లివింగ్ స్టోన్ తిరిగి రానుండగా.. స్టార్క్, మెక్ గుర్క్, ఇంగ్లిస్, స్టోయినోస్ మాత్రం తాము రాలేమని చెప్పారట. ఇంకో ఐదురోజుల్లో ఐపిఎల్ రీ స్టార్ట్ కానుండగా.. అప్పటిలోగా ఎంతమంది జాయిన్ అవుతారో.. రాని వాళ్ళపై జట్టు నిర్వాహకులు, బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.






