Virat Kohli: ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
Virat Kohli: ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు బేర్ గ్రిల్స్. ఇప్పటికే భారత ప్రధాని మోడీ, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, విక్కీ కౌశల్‌తో కలిసి గ్రిల్స్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్స్ చేశాడు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించాడు.

బాలీవుడ్ బ్యూటీ, హాలీవుడ్ లో సైతం క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రాతో సైతం ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు గ్రిల్స్ తెలిపాడు. గ్రిల్స్ ఇదే విషయమై స్పందిస్తూ విరాట్, ప్రియాంక ఇద్దరు ఇన్ స్పిరేషనల్ సెలబ్రిటీలు అన్నాడు. వారికి వరల్డ్ వైడ్ గా ఆదరణ ఉందన్నాడు. కోహ్లితో సాహసం చేయడం ఓ అద్భుతం అని, కోహ్లి నిజమైన సింహం అన్నాడు. ప్రియాంక భర్త నిక్ జోనాస్ ను ఇప్పటికే ఓ సారి ఎపిసోడ్ కు తీసుకెళ్లాను అన్నాడు. బేర్ గ్రిల్స్ తాజా ప్రకటనతో ఇటు కోహ్లి, అటూ ప్రియాంక ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read..

ధోని హెల్త్ అప్‌డేట్.. సీఎస్‌కే సీఈఓ కీలక విషయాలు వెల్లడి

Next Story

Most Viewed