ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..చిన్నస్వామి స్టేడియంపై కీల‌క ప్ర‌క‌ట‌న !

by velandi.Saikiran |   (  Updated:2026-01-17 18:04:25  IST  )

2025 ఐపీఎల్ టోర్నమెంట్ విజేతగా బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే.

ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..చిన్నస్వామి స్టేడియంపై కీల‌క ప్ర‌క‌ట‌న !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగుళూరు జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం లోనే ఐపిఎల్, అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు కర్ణాటక సర్కార్ అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటన చేసింది.

ప్రభుత్వ నిబంధనలు, రూల్స్ కు లోబడి చిన్నస్వామి స్టేడియంలో ఏ మ్యాచ్ అయినా కూడా నిర్వహించుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో బెంగళూరు అభిమానులకు భారీ ఊరట లభించింది. ఐపీఎల్ 2026 నేపథ్యంలో ఎప్పటి లాగానే చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB మ్యాచ్ లు నిర్వహించుకోవచ్చు అన్నమాట. అంటే తన హోమ్ మ్యాచ్ లన్ని కూడా చిన్నస్వామి స్టేడియంలోనే బెంగళూరు జట్టు ఆడబోతుందన్నమాట.

చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కి సలాట

2025 ఐపీఎల్ టోర్నమెంట్ విజేతగా బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ గెలుచుకుంది బెంగళూరు. ఈ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం దగ్గర ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా తొక్కిసేలాట జరిగి ఏకంగా 11 మంది బెంగళూరు ఫ్యాన్స్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిన్నస్వామి స్టేడియం పై బ్యాన్ విధించింది కర్ణాటక సర్కార్. కాగా చిన్నస్వామి స్టేడియం దగ్గ‌ర 11 మంది ఫ్యాన్స్ తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన త‌రుణంలోనే, విరాట్ కోహ్లీ, ఆర్సీబీ యాజ‌మాన్యం, క‌ర్ణాట‌క స‌ర్కార్ బాధిత కుటుంబాలను ఆదుకున్నాయి.

Next Story