ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. ఫస్ట్ మ్యాచ్ డేట్ ఫిక్స్

by Gantepaka Srikanth |

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది.

ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. ఫస్ట్ మ్యాచ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026 సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది. ఈ మెగా టోర్నీ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఆదివారం ధృవీకరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది. తొలుత మార్చి 26న టోర్నీని ప్రారంభించాలని బీసీసీఐ భావించినప్పటికీ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్చల అనంతరం ప్రారంభ తేదీని రెండు రోజులు వెనక్కి జరిపారు. అసోం, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపిన వివరాల ప్రకారం.. షెడ్యూల్‌ను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి విడతలో తొలి 15 నుండి 20 రోజుల మ్యాచ్‌ల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

టోర్నీ ఫార్మాట్..

గత సీజన్ల మాదిరిగానే 10 జట్లు 'హోమ్-అండ్-అవే' పద్ధతిలో తలపడతాయి. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజేతగా నిలిచినందున, ఈసారి ప్రారంభ మ్యాచ్ మరియు ఫైనల్ కూడా బెంగళూరులోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు తమ ప్లేయర్ క్యాంపులు మరియు ప్రాక్టీస్ సెషన్లతో బిజీగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఈ టీ20 లీగ్ కోసం ఇప్పటికే ప్రసారదారులు, ఫ్రాంచైజీలు తమ ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.

Next Story