అంతర్జాతీయ క్రికెట్ కు.. ఇంగ్లాండ్ ఓపెనర్ గుడ్ బై.!

by Geesa Chandu |

అంతర్జాతీయ క్రికెట్ కు.. ఇంగ్లాండ్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ మాజీ స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు.. ఇంగ్లాండ్ ఓపెనర్ గుడ్ బై.!
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కు.. ఇంగ్లాండ్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ మాజీ స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. గత సంవత్సరం భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో చివరిసారిగా బరిలోకి దిగిన ఈ 37 ఏళ్ల ఇంగ్లాండ్ ఓపెనర్, తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ జట్టులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఈ తరుణంలోనే తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు డేవిడ్ మలన్ వీడ్కోలు పలికాడు.

2017 లో ఇంగ్లాండ్ జట్టు తరపున.. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన డేవిడ్ మలన్, ఇప్పటివరకు 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20 లు ఆడాడు. టెస్టు మ్యాచ్ ల్లో 1074 పరుగులు, వన్డేల్లో 1450 పరుగులు, టీ20 ల్లో 1892 పరుగులు చేశాడు. డేవిడ్ మలన్ కు టీ20 ల్లో మంచి రికార్డ్ ఉంది. పొట్టి ఫార్మాట్ లో అత్యంత వేగంగా 1,000 రన్స్ చేసిన బ్యాటర్ గా మలన్ కు రికార్డ్ ఉంది. 24 ఇన్నింగ్స్ ల్లోనే వెయ్యి రన్స్ మార్కును కూడా చేరుకున్నాడు. 2020 సెప్టెంబర్ లో టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పొందిన ఆటగాడు కూడా డేవిడ్ మలనే.

Next Story