Glenn Phillips: ఫైనల్‌లో ఓటమి..స్టేడియంలోనే భార్య‌కు కిస్ !

by velandi.Saikiran |

ఫైన‌ల్లో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో గ్లెన్ ఫిలిప్స్ ను కిస్ ఇచ్చి, ఆయ‌న స‌తీమ‌ణి ఓదార్చింది.

Glenn Phillips: ఫైనల్‌లో ఓటమి..స్టేడియంలోనే భార్య‌కు కిస్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చిన న్యూజిలాండ్ కు నిరాశ ఎదురయింది. ఎంతో కష్టపడి ఫైనల్ దాకా వచ్చిన న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి, టైటిల్ గెల్చుకుంది భారత జట్టు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఇందులో 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ విధించిన 255 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. దీంతో ఎలాంటి పోటీ ఇవ్వకుండానే ఫైనల్ లో అత్యంత దారుణ ఓటమి చవిచూసింది న్యూజిలాండ్.

న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల‌ను ఓదార్చిన భార్య‌లు !

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత భారత క్రికెటర్లు స్టేడియం మొత్తం ఎంజాయ్ చేశారు. కానీ న్యూజిలాండ్ ప్లేయర్లు మాత్రం ఎమోషనల్ అయ్యారు. చివరి మెట్టు దాకా వచ్చి ఓడిపోయిన నేపథ్యంలో, నిరాశకు గురయ్యారు. అయితే న్యూజిలాండ్ క్రికెటర్లు డీలా పడిపోయిన నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ను ఆయన భార్య ఓదార్చింది. హగ్ ఇచ్చి స్టేడియంలోనే ముద్దు కూడా పెట్టింది. హార్దిక్ పాండ్యా, మహిక శర్మతో ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. అటు మరో న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోధీ భార్య కూడా ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Next Story