టీమిండియాకు రిలీఫ్‌..ఆ భ‌యంక‌ర‌మైన ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు!

by velandi.Saikiran |

హ‌ర్ధిక్ పాండ్యా గాయం బారీన ప‌డ్డాడు. అటు శుభ్‌మ‌న్ గిల్ ( Gill) మెడ నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఇక శ్రేయాస్ అయ్య

టీమిండియాకు రిలీఫ్‌..ఆ భ‌యంక‌ర‌మైన ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. గాయాల కారణంగా భారత జట్టుకు దూరమైన వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్, డేంజర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు శుభ్‌మ‌న్ గిల్ కు కూడా ఇవాళ లేదా రేపు అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే జరిగితే దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ లో వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్, డేంజర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు తుది జట్టులోకి వస్తే, భారత జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓపెనర్ సమస్యతో పాటు ఆల్ రౌండ‌ర్‌ సమస్య కూడా తొలగిపోనుంది.

కాగా ఆసియా కప్ సంద‌ర్భంగా హ‌ర్ధిక్ పాండ్యా గాయం బారీన ప‌డ్డాడు. అటు శుభ్‌మ‌న్ గిల్ ( Gill) మెడ నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అతనికి మరికొన్ని రోజుల పాటు రెస్ట్ ఇవ్వబోతున్నారట. ఇది ఇలా ఉండగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొత్తం ఐదు టీ 20లు జరగనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదటి టి20 కటక్ వేదికగా జరగనుంది. డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. టి20 వరల్డ్ కప్ కంటే ముందు, జ‌రుగ‌నున్న ఈ టీ20 సిరీస్ భార‌త జ‌ట్టుకు చాలా కీల‌కం కానుంది. ఇది ఇలా ఉండ‌గా, కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జ‌ట్టు అద్భుతంగా రాణిస్తోంది. ద‌క్షిణాఫ్రికాపై జ‌రిగిన తొలి వ‌న్డేలో విజ‌యం సాధించింది భార‌త్‌. ఈ తొలి వ‌న్డేలో 19 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది భార‌త్‌.

Next Story