బీసీసీఐ వేటు..రీ-ఎంట్రీ కోసం గిల్ స‌రికొత్త ప్లాన్

by velandi.Saikiran |

దేశవాళీ క్రికెట్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు గిల్. అందరు ప్లేయర్ల లాగానే విజయ్ హజారే ట్రోఫీలో గిల్

బీసీసీఐ వేటు..రీ-ఎంట్రీ కోసం గిల్ స‌రికొత్త ప్లాన్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఆడే భార‌త జ‌ట్టులో స్థానం కోల్పోయిన గిల్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు గిల్. అందరు ప్లేయర్ల లాగానే విజయ్ హజారే ట్రోఫీలో గిల్ ఆడనున్నాడు. డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ జ‌రుగ‌నుంది. పంజాబ్ జట్టు తరుపున గిల్ బరిలోకి దిగనున్నాడు.

గిల్ తో పాటు ఇదే జట్టులో అభిషేక్ శర్మ అలాగే అర్షదీప్ సింగ్ ఉంటారు. ఈ టోర్నమెంట్లో రాణించి, మళ్లీ భారత జట్టులో చేరాల‌న్న‌ లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు గిల్. కాగా కాలి గాయం కారణంగా గిల్ ను టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి తొలగించింది బీసీసీఐ. పైకి ఈ కారణం చెప్పినప్పటికీ, గిల్ ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతోనే టీ20 జట్టు నుంచి తొలగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ను తొలగించి, కొత్త‌గా టీ20 వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కు అవకాశం ఇచ్చారు. అటు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ఆడనుంది భారత జట్టు. క్లిక్

Next Story