Netflix suggests David Warner should act in Telugu movies

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-07 08:45:13  IST  )

మైదానంలో బ్యాట్‌తో చెలరేగే ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్.. ఫీల్డింగ్‌లోనూ మెరుపు విన్యాసాలతో అలరించడం తెలిసిందే.

Netflix suggests David Warner should act in Telugu movies
X

దిశ, వెబ్ డెస్క్: మైదానంలో బ్యాట్‌తో చెలరేగే ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్.. ఫీల్డింగ్‌లోనూ మెరుపు విన్యాసాలతో అలరించడం తెలిసిందే. అయితే హైదరాబాద్ తరపున సన్ రైజర్స్‌కు ఆడటంతో వార్నర్ ఇక్కడి సినిమాలపై మనసుపడ్డాడు. తరచూ ఇన్ స్టా వేదికగా హిందీ, తెలుగు సినిమాల రీల్స్‌తో సందడి చేస్తూ అటూ ఆస్ట్రేలియా, ఇటు తెలుగు అభిమానులను అలరిస్తున్నాడు. కాగా వార్నర్‌కు నెట్ ఫ్లిక్స్ ఓ కీలక సూచన చేసింది. రిటైర్మెంట్ తర్వాత తెలుగు సినిమాల్లో నటించాలని ట్విట్టర్ వేదికగా కోరింది. దీనికి స్పందించిన వార్నర్ నవ్వుతున్న ఎమోజీలను రీట్వీట్ చేశాడు. వార్నర్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గెటప్, డీజే టిల్లు వేషాధారణతో అభిమానుల మనసు దొచుకున్న సంగతి తెలిసిందే.

Also Read..

రిటైర్మెంట్‌పై Sania Mirza న్యూ అప్‌డేట్

Next Story